close
BETA SITE

ఎన్నికలకు మూడు లక్షల మంది! 

మొత్తం జిల్లాల సంఖ్య ఆధారంగా సిబ్బంది 
స్వల్పంగా పెరిగిన  పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 
అధికారిక సమాచారం లేకున్నా ప్రక్రియ ప్రారంభం

పట్టణ ప్రాంతంలోని ఒక్కో పోలింగు కేంద్రంలో 1,300 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 1,100 మంది ఓటర్లు మాత్రమే ఉండాలి. 
గత ఎన్నికలలో 31,253 కేంద్రాలుండగా అందులో ఓటర్ల సంఖ్యను కుదించడంతో తాజాగా మరో 1,503 పెరిగాయి. వీటికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభించాలి. 
పోలింగు కేంద్రాల్లో నలుగురు లేదా అయిదుగురి చొప్పున 1.42 నుంచి 1.63 లక్షల మంది 
ఓట్ల లెక్కింపునకు మరో 25 వేల మంది 
భద్రత, ఓటింగ్‌ యంత్రాల నిర్వహణ, లెక్కింపునకు 1.50 లక్షలు 
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సుమారు 3 లక్షల మంది సిబ్బంది అవసరమని ఎన్నికల సంఘం అంచనా వేసింది. షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు మరింత గడువు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారం విస్తృతంగా ఉంది. దీనిపై రాష్ట్రప్రభుత్వం.. ఎన్నికల సంఘం నుంచి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి కార్యాలయంలో చేపట్టింది. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరగకున్నా కొత్తగా జిల్లాలు ఏర్పడటంతో మరింత సిబ్బంది అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.

సిబ్బందిలేమితో సతమతం: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా వేరుపడింది. దీంతో రాష్ట్రంలో సిబ్బందిలేమి వెంటాడుతోంది. ఇందుకు ఉన్నతస్థాయిలో సమీక్షలు జరిగినా ఫలితం లేదు. ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడిన తరవాత నుంచి ఆయా సిబ్బందిని సమీకరిస్తామని ఓఉన్నతాధికారి ‘ఈనాడు’తో చెప్పారు. సాధారణ సమయానికి ఎన్నికలు జరిగినా ఓటింగ్‌ యంత్రాల భద్రపరిచేందుకు ప్రయివేటు గిడ్డంగులనే వినియోగించాల్సిన పరిస్థితి. 21 జిల్లాల్లో నూతన గిడ్డంగులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లను మంజూరు చేసింది. నిర్మాణ వ్యవహారాలను రహదారులు-భవనాల శాఖకు ఎన్నికల సంఘం అప్పగించింది. నిర్మాణ ప్రక్రియ వచ్చే ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నాటికి అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు ప్రయివేటు గిడ్డంగులోనే భద్రం చేస్తామని అధికారి ఒకరు చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.