close
BETA SITE

బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు ఆరంభం 

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఆరంభమయ్యాయి. పెద్దశేష వాహనసేవతో ఉత్సవాలకు తితిదే శ్రీకారం చుట్టింది. గురువారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రికి హంసవాహన సేవలు జరుగుతాయి.

యాత్రికుల రద్దీ సాధారణం 
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తమిళులు పవిత్రంగా భావించే పురటాసి మాసం కావడం, తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో.. యాత్రికుల సంఖ్య భారీగా ఉంటుందని తితిదే అంచనా వేసింది. అందుకు భిన్నమైన పరిస్థితి బుధవారం కనిపించింది. శ్రీవారి మూలవిరాట్‌ దర్శనం స్వల్ప వ్యవధిలో పూర్తవుతోంది. అద్దె గదులు సులభంగా లభిస్తున్నాయి. శుక్రవారం నుంచి రద్దీ పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు