close
BETA SITE

ఎమ్మెల్సీ బెదిరిస్తున్నారని గ్రామస్థుల ఫిర్యాదు 

కర్నె ప్రభాకర్‌కు చెందిన క్రషర్‌ మూసేయాలని డిమాండ్‌ 

సద్దుపల్లి (అబ్దుల్లాపూర్‌మెట్‌), న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు చెందిన క్రషర్‌ ప్లాంట్‌ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి, శబ్ధ కాలుష్యంతో ఇబ్బందులకు గురవుతున్నామంటూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం సద్దుపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పరిమితికి మించిన సామర్థ్యం(లోడ్‌)తో లారీలు వెళ్తున్నాయని తెలిపారు. విషయాన్ని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్తే చంపిస్తానని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు వివరించారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు