close
BETA SITE

మలేసియా ఎక్స్‌ప్రెస్‌వేపై అధ్యయనం 

త్వరలో ఆరుగురి బృందం పరిశీలన 
  అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాంతీయ వలయ రహదారి 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ వలయ రహదారి(రింగు రోడ్డు)ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్‌ప్రెస్‌ వేగా నిర్మించేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ వ్యవహారాలను జాతీయ రహదారుల సంస్థ(నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా) చేప్పట్టనుంది. మలేసియా-సింగపూర్‌ అనుసంధానం కోసం నిర్మించిన ఉత్తర-దక్షిణ ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని అధ్యయనం చేసేందుకు బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. మొత్తం 334 కిలోమీటర్ల నిడివి గల ప్రాంతీయ వలయ రహదారిని నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం దాన్ని ఎక్స్‌ప్రెస్‌ వేగా మార్చాలనుకున్న విషయం విదితమే. రంగారెడ్డి-నరసాపూర్‌- తూప్రాన్‌-గజ్వేల్‌- జగదేవ్‌పూర్‌-భువనగిరి- చౌటుప్పల్‌-ఇబ్రహీంపట్నం- ఆమనగల్‌-షాద్‌నగర్‌-చేవెళ్ల- శంకర్‌పల్లి-కంది మార్గాన్ని జాతీయ రహదారిగా కేంద్రం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. మలేసియా-సింగపూర్‌ ఎక్స్‌ప్రెస్‌వే అధ్యయనానికి ఆరుగురు సభ్యుల బృందం అక్కడకు వెళ్లనుంది. రహదారులు-భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి, ఈ మార్గం సవివర నివేదిక(డీపీఆర్‌)ను సిద్ధం చేస్తున్న కన్సల్టెన్సీ నుంచి ఇద్దరు సభ్యులతో కలిసి బృందం ఆ మార్గాన్ని పరిశీలించనుంది.

మంత్రిని కలిసిన మలేసియా బృందం 
ప్రాంతీయ వలయ రహదారిని ఎక్స్‌ప్రెస్‌ వేగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మలేసియాకు చెందిన కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ బోర్డు(సీఐడీబీ) ప్రతినిధులు పంకజ్‌ అగర్వాల్‌, లలిత్‌ ఆరోరాలు సోమవారం మంత్రి తుమ్మలను కలిశారు. ఈసందర్భంగా మలేసియా-సింగపూర్‌ మార్గం తీరుతెన్నులను వివరించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.