close
BETA SITE

నకిలీ పత్రాలు తయారు చేస్తే పీడీ చట్టం ప్రయోగం 

ఆర్మూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నకిలీ పట్టా పాసు పుస్తకాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు తయారు చేసే వారిపై పీడీ చట్టం ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూర్‌లో ఆదివారం ఆయన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గతంలో రూ.500 ఇస్తే 100 నకిలీ పట్టా పాసు పుస్తకాలు తయారు చేసే వారని, ఇప్పుడు అలాంటి వాటికి అవకాశం లేకుండా 17 విధానాలతో కొత్త పట్టా పాసు పుస్తకాలు తయారు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో శ్రమించి భూరికార్డుల ప్రక్షాళన చేశారని, తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.