close

ఒక్క ఓవర్లో 43 పరుగులు

                                                                                                                      

వెల్లింగ్టన్‌: ఇది క్రికెట్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఘటన. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ న్యూజిలాండ్‌ జోడీ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు సహా ఏకంగా 43 పరుగులు రాబట్టింది. రెండు నోబాల్స్‌ సహకారంతో లిస్ట్‌-ఎ క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ పరుగుల వరద పారింది న్యూజిలాండ్‌ దేశవాళీ వన్డే మ్యాచ్‌లో. బుధవారం సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్‌తో మ్యాచ్‌లో నార్త్‌ర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ జో కార్టర్‌-బ్రెట్‌ హాంప్టన్‌ ద్వయం ఈ విధ్వంసానికి పాల్పడింది. వారి బాధితుడైన ఆ దురదృష్టకర ఫాస్ట్‌బౌలర్‌ పేరు విలెమ్‌ లుదిక్‌. 
ఆ ఓవర్‌ సాగిందిలా..: 4, 6 (నోబాల్‌), 6 (నోబాల్‌), 6, 1, 6, 6, 6.. ఇలా సాగింది లుదిక్‌ వేసిన ఆ ఓవర్‌. హాంప్టన్‌ 23 పరుగులు చేయగా.. కార్టర్‌ 18 పరుగులు సాధించాడు. లిస్ట్‌-ఎ వన్డే మ్యాచ్‌లో ఇంతకుముందు రికార్డు 39 (ఒకే ఓవర్లో) పరుగులు. ఢాకా ప్రిమియర్‌ లీగ్‌లో జింబాబ్వే బ్యాట్స్‌మన్‌ చిగుంబుర ఈ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో గిబ్స్‌, యువరాజ్‌ ఒకే ఓవర్లో అత్యధికంగా 36 పరుగులు సాధించారు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.