close

దిల్లీ ఎట్టకేలకు..   

                                                                      

గ్రేటర్‌ నోయిడా: మూడు వరుస పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్‌ దిల్లీ మళ్లీ గెలుపు రుచి చూసింది. గురువారం హోరాహోరీ సాగిన జోన్‌-ఏ మ్యాచ్‌లో దిల్లీ 39-33తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. ఆరంభంలో ఇరు జట్ల రైడర్లు పాయింట్ల కోసం పోటీపడడంతో స్కోరు సమానంగా సాగింది. ఐతే వికాస్‌ రాణించడంతో 13-9తో దిల్లీ ఆధిక్యంలో నిలిచింది. మిరాజ్‌ షేక్‌, నవీన్‌ కుమార్‌, రవీందర్‌ మెరవడంతో దిల్లీ విజయాన్ని అందుకుంది. దిల్లీ జట్టులో నవీన్‌కుమార్‌ 9 రైడ్‌ పాయింట్లు సాధించగా.. రవీందర్‌ 6 ట్యాకిల్స్‌తో అదరగొట్టాడు. మరో మ్యాచ్‌ (జోన్‌-బి)లో బెంగళూరు బుల్స్‌ 37-27తో యూపీ యోధను ఓడించింది. బెంగళూరు జట్టులో పవన్‌ షెరావత్‌ 10 రైడ్‌ పాయింట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మహేందర్‌ 6 ట్యాకిల్స్‌ చేశాడు. యూపీ జట్టులో రిషాంక్‌ ఐదు రైడ్‌ పాయింట్లు తీసుకొచ్చాడు.

ప్రొ కబడ్డీలో ఈనాడు 
యు ముంబా × జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ (రా.8 నుంచి) 
బెంగాల్‌ వారియర్స్‌ × తెలుగు టైటాన్స్‌ (రా.9 నుంచి)

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.