close

శివ సింగ్‌ @ 360 

                                                                                                                 
కోల్‌కతా: ఏ స్పిన్నరైనా బంతిని గిర్రున తిప్పేస్తాడు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్‌ శివ సింగ్‌ మాత్రం బంతితోపాటు రనప్‌లో తానూ గిర్రున తిరిగి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ డెలివరీని అంపైర్‌ డెడ్‌బాల్‌గా ప్రకటించినా శివ వినూత్న ప్రయత్నం మాత్రం అందరినీ విపరీతంగా ఆకర్షించింది. బంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మధ్య సికే నాయుడు ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా ఈ చిత్రం చోటు చేసుకుంది. ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టు సభ్యుడైన శివ.. పరుగెత్తుకుంటూ వచ్చి డెలివరీ వేయడానికి ముందు 360 డిగ్రీలు తిరిగాడు. అంపైర్‌ వినోద్‌ దాన్ని డెడ్‌బాల్‌ ప్రకటించగా.. బౌలర్‌, ఫీల్డర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం.. ఏ బౌలరైనా కావాలని బ్యాట్స్‌మన్‌ ఏకాగ్రత చెదిరేలా బౌలింగ్‌ చేస్తే అంపైర్‌ దాన్ని డెడ్‌బాల్‌గా ప్రకటించవచ్చు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.