close

యూపీతో ‘టై’టాన్స్‌ 


                                                

గ్రేటర్‌ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధతో మ్యాచ్‌ను తెలుగు టైటాన్స్‌ 26-26తో టై చేసుకుంది. మంగళవారం హోరాహోరీ సాగిన మ్యాచ్‌లో ఆరంభంలో   10-19తో వెనకబడిన టైటాన్స్‌ ద్వితీయార్ధంలో పుంజుకుంది. 24-26తో ప్రత్యర్థి స్కోరుకు దగ్గరగా వచ్చిన టైటాన్స్‌.. ఆ తర్వాత 26-26తో స్కోరు సమం చేసింది. అయితే అక్కడ నుంచి రాహుల్‌ చౌదరి, రిషాంక్‌ దేవడిగ పాయింట్లు తేవడంలో విఫలం కావడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. మరో మ్యాచ్‌లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌ 38-32తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించి ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకుంది. అనూప్‌ కుమార్‌ విజృంభించడంతో ఆరంభంలో జైపుర్‌ ఆధిక్యంలోకి వెళ్లినా.. సచిన్‌ మెరవడంతో హరియాణా కూడా గట్టిగా ప్రతిఘటించింది. అయితే తొమ్మిదో నిమిషంలో హరియాణాను ఆలౌట్‌ చేసిన జైపుర్‌ 11-6తో ఆధిక్యంలో నిలిచింది. వికాస్‌ రాణించడంతో హరియాణా కూడా గట్టిపోటీ ఇచ్చింది. ఒక దశలో ఆ జట్టు 22-24తో ప్రత్యర్థికి సమీపంగా వచ్చింది. అయితే మోహిత్‌ కీలక సమయంలో రైడ్‌ పాయింట్లు తేవడంతో 28-25తో ఆధిక్యంలోకి వెళ్లిన జైపుర్‌.. ఆ తర్వాత అదే ఊపులో 38-32తో విజయం సాధించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
Ad Space

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.