close
BETA SITE

మంత్రుల సమక్షంలో తెరాసలో చేరికలు

ఈనాడు, హైదరాబాద్‌: మంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డిల సమక్షంలో దేవరకొండ, జడ్చర్ల తదితర నియోజక వర్గాలకు చెందిన నేతలు బుధవారం రాత్రి తెలంగాణభవన్‌లో తెరాసలో చేరారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కంకణాల వెంకట్‌రెడ్డి, కార్యదర్శి ముత్యంరావు తమ అనుచరులతో వచ్చి తెరాసలో చేరారు. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన 11 మంది కాంగ్రెస్‌ మాజీ సర్పంచులు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేత రామ్‌లాల్‌లకు మంత్రులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, విపక్ష పార్టీల దుస్థితి చూసి చాలామంది తెరాసలో చేరేందుకు వస్తున్నారని తెలిపారు. వారిని స్వాగతిస్తున్నామని చెప్పారు. స్థానిక పార్టీ నేతలతో సమన్వయంతో పనిచేసి తెరాస అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.

కేటీఆర్‌తో ఆశావహుల భేటీ 
తెలంగాణ భవన్‌లో తెరాస టికెట్‌ను ఆశిస్తున్న పలువురు నేతలు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేటీఆర్‌ను కలిసి ముషీరాబాద్‌ టికెట్‌ గురించి చర్చించారు. తనకు లేదా తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ఈ టికెట్‌ ఇవ్వాలని కోరారు. ఈ అంశం సీఎం దగ్గర ఉందనీ, మీతో(నాయిని) చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్‌ తెలిపారు. మాజీ మంత్రి వినోద్‌ కేటీఆర్‌ను కలిసి ఎస్సీ నియోజక వర్గాల టికెట్లలో ఒకటి తనకు ఇవ్వాలని అభ్యర్థించారు.  గోషామహల్‌ నేత నందకిశోర్‌వ్యాస్‌ బిలాల్‌ తన మద్దతుదారులతో వచ్చి మంత్రితో భేటీ అయ్యారు. టికెట్‌ తనకే ఇవ్వాలని కోరారు. 
హుజూర్‌నగర్‌ టికెట్‌ కోసం తెరాస ఇన్‌ఛార్జి శంకరమ్మ కేటీఆర్‌ను కలిసేందుకు విఫలయత్నం చేశారు. ఈ సందర్భంగా శంకరమ్మ మాట్లాడుతూ, టికెట్‌ తనకు రాకుంటే మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటిముందు ఆత్మాహుతికైనా సిద్ధమేనని హెచ్చరించారు. ఒకవేళ ఉత్తమ్‌పై పోటీ చేయాలనుకుంటే జగదీశ్‌రెడ్డి వచ్చి పోటీ చేయాలనీ, అప్పుడు తాను సూర్యాపేటకు వెళతానని పేర్కొన్నారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు