close
BETA SITE

రాష్ట్రంలో కేసీఆర్‌ శకం ముగిసింది: కాంగ్రెస్‌

సభ వెలవెలబోయిందని విమర్శ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: అధికార పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభ వెలవెలబోయిందని, అందుకే కేసీఆర్‌ ప్రసంగంలో నిరాశ కనిపించిందని కాంగ్రెస్‌ నేతలు అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ శకం ముగిసిందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియాపాయింట్‌లో ఎమ్మెల్యే డీకే అరుణ, గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు మాట్లాడారు. ప్రగతి నివేదన సభకు 25 లక్షల మంది వస్తున్నట్టు గొప్పలు చెప్పుకున్నా..మూడు లక్షలకు మించి రాలేదన్నారు. సభ ద్వారా దర్పం చాటుకోవాలనుకున్న కేసీఆర్‌ ఆశలు నెరవేరలేదని..అందుకే ఆయన ప్రసంగం పేలవంగా సాగిందన్నారు. తన వెంట జనం లేరన్న నిజం సభ ద్వారా కేసీఆర్‌కు అర్థమైందన్నారు. ముందస్తుకు పోతే ముందుగానే కుర్చీ పోవడం ఖాయమన్నారు. తెరాస నేతలు జనాన్ని తరలించేందుకు ట్రాక్టర్లు, ఆర్టీసీ బస్సులను మొబైల్‌ బార్లుగా మార్చారని ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగానికి సహకరించిన ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు దిల్లీకి గులాంలు కాలేదని, దిల్లీకి, మోదీకి గులాంగా మారింది కేసీఆరేనన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.