close
BETA SITE

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: మందకృష్ణ

ఈనాడు, హైదరాబాద్‌:  హైకోర్టు విభజన కోసం లోక్‌సభను స్తంభింపజేసిన తెరాస ఎంపీలు.. ఎస్సీ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి కనబర్చడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడచినా ఈ విషయమై ఒక్కసారీ మాట్లాడలేదని ఆరోపించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోగా అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తూ జనవరి 1 నుంచి 5 రోజుల పాటు శాంతియుత ఉపవాస దీక్షకు చేయనున్నట్లు తెలిపారు. గురువారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో దళితుల కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు పెడతామన్న తెరాస సర్కారు...ఇప్పటి వరకు ఖర్చుచేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.