close
BETA SITE

సైన్స్‌ కాంగ్రెస్‌పై రాష్ట్ర ప్రభుత్వ కుట్ర: లక్ష్మణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాల్ని నిర్వహించలేమని ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటించడం వెనుక తెలంగాణ ప్రభుత్వ కుట్ర దాగి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. దశాబ్దాల కాలంగా తీవ్రవాదంతో ఇబ్బందులకు గురవుతూ, ఆ సమస్యను సమర్థంగా ఎదుర్కొంటున్న రాష్ట్రం మణిపూర్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాల్ని నిర్వహించగలిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆశక్తత వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశాల్ని నిర్వహించడంలో ఎందుకు విఫలమయ్యారో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు, ఓయూ విద్యార్థులకు సమాధానం చెప్పాలన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.