close
BETA SITE

ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం 

ఉద్యోగ సాధన బస్సుయాత్ర ప్రారంభంలో ఆచార్య నాగేశ్వర్‌ 

కవాడిగూడ(హైదరాబాద్‌), న్యూస్‌టుడే: ఉద్యోగాలు సాధించే వరకు పోరాడాలని శాసనమండలి మాజీ సభ్యుడు,  ఆచార్య నాగేశ్వర్‌ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో ఉద్యోగ సాధన బస్సు యాత్రను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను ప్రకటించి, ఏటా ఉద్యోగ ప్రకటనలు  విడుదల చేయాలన్నారు. ఆటంకాలు ఏర్పడే ప్రకటనలను విడుదల చేస్తూ వెనక్కు తీసుకోవడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రైవేట్‌ రంగంలో యువత ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా వారికి వృత్తి నైపుణ్యాలను అందించేలా ప్రభుత్వం శిక్షణ శిబిరాలను నిర్వహించాలని కోరారు. పీవైఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు హన్మేశ్‌ మాట్లాడుతూ.. ఉద్యోగాల సాధన బస్సు యాత్ర తెలంగాణలోని 31 జిల్లాల్లో సాగుతుందన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.విజయ్‌కుమార్‌, ఏఐడీవైఓ రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి తŸదితరులు పాల్గొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.