close
BETA SITE

మీడియా పాయింట్‌

అసెంబ్లీని ఏకపక్షంగా వాయిదా వేశారు

అసెంబ్లీని 50 రోజులు నడుపుతామని చెప్పి..ఇప్పుడు అర్ధాంతరంగా వాయిదా వేశారు. బీఏసీ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటామని..ఏకపక్షంగా వాయిదా వేశారు. ఏ ప్రజా సమస్యపైనా ప్రభుత్వం చర్చ జరపలేదు. అధికార పార్టీ సొంత డబ్బా కొట్టుకోవడానికే సమావేశాలు పరిమితమయ్యాయి.

- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,  టీపీసీసీ అధ్యక్షుడు

సభను స్పీకర్‌ నడిపిస్తున్నారా, సీఎం నడిపిస్తున్నారా అర్థం కాలేదు.

  - జీవన్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత

ఉభయ సభలను అధికార పార్టీ ప్రజా సమస్యలపై చర్చించడానికి కాకుండా..ప్రచార వేదికగా మలుచుకుంది

- పొంగులేటి సుధాకర్‌రెడ్డి

చాలా సమస్యలపై చర్చ జరగలేదు

రాష్ట్రంలో చాలా సమస్యలున్నా...వాటిపై చర్చ జరపలేదు.మున్సిపాలిటీలు, విద్యా రంగ సమస్యలు, పరిశ్రమలు, పాలక పక్ష నాయకులపై వస్తున్న భూ కబ్జాల ఆరోపణలు..ఇంకా అనేకఅంశాలపై చర్చ జరుపుతామని చెప్పి వాయిదా వేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సభలో సమస్యలు లేవనెత్తలేదు. భాజపా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించింది.

-కిషన్‌రెడ్డి, భాజపా పక్షనేత

నిరవధిక వాయిదా దారుణం

సమావేశాలు 50 రోజులు జరుపుకుందామని సీఎం కేసీఆర్‌ చెప్పి నిరవధికంగా వాయిదా వేయడం దారుణం. పార్టీ ఫిరాయింపులను సీఎం కేసీఆర్‌ ప్రోత్సహించారు. కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్యను తక్కువగా పేర్కొనడం అన్యాయం. సీపీఐ సభ్యుడు పార్టీ మారినా ఆ పార్టీ సభ్యుడిగానే చూపించడం...తెదేపా సభ్యులను ముగ్గురు గానే చూపించడం స్పీకర్‌ పక్షపాత వైఖరికి నిదర్శనం.

- సండ్ర వెంకటవీరయ్య, తెదేపా ఎమ్మెల్యే

ఏ వర్గానికీ భరోసా ఇవ్వలేకపోయారు

అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా జరిగాయి. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే...ఏ ఒక్క అంశంపైనా సమగ్ర చర్చ జరగలేదు.

- సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.