close
BETA SITE

స్ఫూర్తిదాయకంగా శాసనసభ శీతాకాల సమావేశాలు

సభలో విఫలమైన విపక్షాలు  ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు అర్థవంతంగా, స్ఫూర్తిదాయకంగా జరిగాయని ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. విప్‌లు గంపగోవర్దన్‌, గొంగడిసునీత, నల్లాల ఓదెలులతో శుక్రవారం తెరాస ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వం అన్నింటికీ సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్‌, భాజపా ఇతర విపక్ష పార్టీల నుంచి ఒక్క నిర్మాణాత్మక సలహా రాలేదు. బిల్లులను ఆమోదించి, వాటికి చట్టరూపం తెచ్చినందున ప్రజలకు మేలు జరుగుతుంది. డిసెంబరులో మరోసారి సమావేశం జరుపుతామని సీఎం సభలో చెప్పారు’’ అని ఈశ్వర్‌ అన్నారు.
‘దేశానికి ఆదర్శంగా మండలి సమావేశాలు’: శాసనమండలి శీతాకాల సమావేశాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుండి వెంకటేశ్వర్లు అన్నారు. తెరాస ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మండలి సమావేశాలను శాసనసభకు దీటుగా నడిపించారన్నారు.. కొన్నిసార్లు విపక్షాలకే ఎక్కువ అవకాశమిచ్చామని పేర్కొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.