close
BETA SITE

తాజావార్తలు

గుహలో చిక్కుకున్న వారిని నేను కాపాడతా

గుహలో చిక్కుకున్న వారిని నేను కాపాడతా

మెక్సికో: థాయ్‌లాండ్‌లోని ఓ భారీ గుహలో చిక్కుకున్న 12మంది బాలురను, ఫుట్‌బాల్‌ కోచ్‌ను బయటకు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని మెక్సికోలో 69 రోజులు భూగర్భంలోనే జీవితం గడిపిన మారియో సెపుల్‌వేదా తెలిపారు. 2010లో మారియోతో పాటు మరో 32 మంది దాదాపు 10 వారాల పాటు సాన్‌ జోన్స్ బంగారం రాగి గనులలో గడిపారు. ఎట్టకేలకు వారు ఒక్కొక్కరుగా బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అప్పట్లో మెక్సికోలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు థాయ్‌లాండ్‌లోనూ అదే పరిస్థితి. థాయ్‌లాండ్‌లోనే అతి పెద్ద గుహల్లొ ఇదొకటి. వరద నీరు వీరందరినీ దాదాపు 4 కిలోమీటర్ల లోపలికి లాక్కెళ్లిపోయింది. అంతా 11 నుంచి 16 ఏళ్ల మధ్య వయసువారే. ఎట్టకేలకు బ్రిటిష్ గజ ఈతగాళ్లు వీరిని కనిపెట్టగలిగారు. వీరంతా ఓ పెద్ద మట్టి దిబ్బపై ఉన్నారు. ఇటువంటి సమయంలో వాళ్లని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రభుత్వం సహకరిస్తే నేను వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేస్తానని 40 సెకన్ల వీడియోలో మారియో తెలిపారు. ఇప్పుడు వారిని బయటకు తీసుకురావడానికి మూడు అవకాశాలు ఉన్నాయి. గుహలో ఉన్న దారిలో నీటిలో ఈదుకుంటూ బయటపడటం, గుహ పై నుంచి రంధ్రం చేయడం, వర్షాలు తగ్గే వరకూ వేచి ఉండటం. అక్కడ గుహలో చిక్కుకున్న బాలురకు అసలు ఈతే రాదు. కాబట్టి వారు అంతదూరం ఈదలేరు. మిగిలిన రెండు అవకాశాలపై థాయ్‌లాండ్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సమయంలో దాదాపు 69రోజులు భూగర్భంలో జీవనం గడిపిన అనుభవం ఉన్న మారియో వారికి ఎంతవరకూ సహాయం చేయగలడో వేచి చూడాల్సిందే.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.