close
BETA SITE

తాజావార్తలు

పోలవరం గ్యాలరీ ప్రారంభించిన చంద్రబాబు

 కుటుంబసభ్యులు, ప్రజా ప్రతినిధులతో కలిసి గ్యాలరీలో నడక

పోలవరం గ్యాలరీ ప్రారంభించిన చంద్రబాబు
 

పోలవరం: నదుల అనుసంధాన వేదిక, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి, ఎన్నో సంచలనాలకు, రికార్డులకు వేదికైన పోలవరం ప్రాజెక్టు చరిత్రలో మరో అధ్యాయానికి బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు స్పిల్‌వే అంతర్భాగంలో నిర్మించిన గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులతో కలిసి గ్యాలరీలో నడిచారు. వారి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు గ్యాలరీలో నడిచారు.

అంతకుముందుకు చంద్రబాబు కుటుంబసభ్యులతో సహా అమరావతి నుంచి హెలికాప్టర్‌లో పోలవరం వద్దకు చేరుకున్నారు. గ్యాలరీ పూర్తి సందర్భంగా ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించి ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
గ్యాలరీలో నడక సంక్లిష్టం కావడంతో అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేశారు. గ్యాలరీలో వైద్య బృందాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, అత్యవసరమైతే తరలించేందుకు అంబులెన్సులు సిద్ధం చేశారు. దాదాపు రెండు వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మరో వెయ్యి మంది గ్రేహౌండ్స్‌, సీఆర్‌ఫీఎఫ్‌ దళాలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా వైపున ఉన్న అడవుల్లో కూంబింగ్‌ నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పరిసరాలను పోలీసులు నిన్ననే తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి బందోబస్తును 11 సెక్టార్లుగా విభజించారు. అటు ప్రజలు.. ఇటు ప్రజాప్రతినిధుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

పోలవరం గ్యాలరీ ప్రారంభించిన చంద్రబాబు

పోలవరం గ్యాలరీ ప్రారంభించిన చంద్రబాబు


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.