close
BETA SITE

తాజావార్తలు

ప్రేమ వేధింపులకు యువతి బలి

నిందితుడిని అరెస్ట్‌ చేయాలంటూ కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళన

ప్రేమ వేధింపులకు యువతి బలి

గంపలగూడెం: ప్రేమించమని వెంట పడుతూ తోటి విద్యార్థి వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపానికి గురైన ఝాన్సీ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కొణిజెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఝాన్సీ ఆత్మహత్యకు గోపి అనే యువకుడి వేధింపులే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో తనను పెళ్లి చేసుకోమని గోపీ వేధిస్తుండేవాడని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఝాన్సీ తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పలుమార్లు అతడిని మందలించారని తెలిపారు. నిన్న కాలేజీకి వెళ్లి వస్తున్న ఝాన్సీని గోపీ బస్టాండ్‌ వద్ద అడ్డగించి పెళ్లిచేసుకోమని బెదిరించాడని.. ఆమె నిరాకరించడంతో చంపుతానని బెదిరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ మనస్తాపంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. విద్యార్థిని మృతికి కారణమైన గోపీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు గోపీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.