close

తాజా వార్తలు

మేం కోరిన స్థానాలే ఇవ్వాలి: కోదండరాం

మేం కోరిన స్థానాలే ఇవ్వాలి: కోదండరాం

హైదరాబాద్‌: తెరాసను ఓడించడమే లక్ష్యంగా తెలంగాణలో ఏర్పాటైన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. మూడు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు తర్వాత కూటమిలో భాగస్వామ్య పక్షాలకు 26 సీట్లు కేటాయించనున్నట్టు కాంగ్రెస్‌ ఈ రోజు స్పష్టంచేసింది. మిగతా 93 స్థానాల్లో తాము పోటీ చేస్తామని తెలిపింది. తెలంగాణ జనసమితి, కాంగ్రెస్‌ మధ్య ఐదు స్థానాలకు ఏకాభిప్రాయం కుదిరింది. మిగిలిన మూడు స్థానాలపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది. అయితే, ఎనిమిది సీట్లు కేటాయించడంపై తెజస స్పందించింది. 12 సీట్లు కావాలని తాము కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరుతూ జాబితా సమర్పించామని తెలిపింది. కాంగ్రెస్ ‌మాత్రం ఎనిమిది సీట్లు మాత్రమే ఇస్తున్నట్టు ప్రకటించిందన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఎనిమిది సీట్లలో తెజస కోరిన స్థానాలే ఇవ్వాలని కోదండరాం ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి యోగేశ్వర్‌ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.


తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు