close

తాజా వార్తలు

శామ్‌సంగ్‌ మడతబెట్టే ఫోన్‌ ఇదే..

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌(మడతబెట్టే ఫోన్‌)ను ఎట్టకేలకు దక్షిణకొరియా సంస్థ శామ్‌సంగ్‌ పరిచయం చేసింది. గత కొంతకాలంగా ఈ ఫోన్‌ గురించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన శామ్‌సంగ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ 2018లో ఈ ఫోన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.

ఈ ఫోన్‌ను ట్యాబ్‌ మోడ్‌, ఫోన్‌ మోడ్‌ రెండు విధాలుగా వాడుకోవచ్చు. 7.3 అంగుళాల డిస్‌ప్లే గల ఫోన్‌ను సగానికి మడతబెట్టేయ్యొచ్చు. అలా సగానికి మూసిన తర్వాత అవతలివైపు 4.5 అంగుళాల డిస్‌ప్లే కన్పిస్తుంది. అయితే ఇంతకు మించి దీని గురించి ఎలాంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. గెలాక్సీ ఎక్స్‌ లేదా గెలాక్సీ ఎఫ్‌ అనే పేరుతో ఈ ఫోన్‌ను విడుదల చేస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి కూడా కంపెనీ స్పష్టతనివ్వలేదు.

శామ్‌సంగ్‌ మడతబెట్టే ఫోన్‌ ఇదే..

ఈ సందర్భంగా శామ్‌సంగ్‌ మొబైల్‌ ప్రొడక్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జస్టిన్‌ డెన్నిసన్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఫోన్‌లో యాప్‌ కొనసాగింపు ఉంటుంది. అంటే మీరు ఓ యాప్‌ను వాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్‌ను మడిచేస్తే.. ఆ యాప్‌ చిన్న తెరపై ప్రత్యక్షమవుతుంది. అంతేగాక.. ఒకేసారి మూడు యాప్‌లను తెరుచుకునే సౌలభ్యం కల్పిస్తున్నాం. మల్టీ యాక్టివ్‌ విండో పేరుతో ఈ సదుపాయాన్ని అందిస్తున్నాం’ అని తెలిపారు. వచ్చే ఏడాది ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు శామ్‌సంగ్‌ సన్నాహాలు చేస్తోంది.


తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు