close

తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో అక్షరహాసన్‌ వ్యక్తిగత చిత్రాలు లీక్‌

ముంబయి పోలీసులను ఆశ్రయించిన నటి

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర నటుడు కమల్‌హాసన్‌ గారాలపట్టి అక్షరహాసన్‌కు సంబంధించిన కొన్ని వ్యక్తిగత చిత్రాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. సోషల్‌మీడియా వేదికగా పలువురు వీటిని పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్షరహాసన్‌ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

‘‘ఇటీవల నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఎవరు చేశారు ఈ పని? ఇప్పటివరకూ ఈ విషయం నాకు తెలియదు. కానీ, నాకు తెలిసిందేంటంటే ఒక యువతి పట్ల ఇలా ప్రవర్తించడం నిజంగా దురదృష్టకరం. ఇతరులను ఆకర్షించడానికి షేర్‌ చేస్తున్న ప్రతి వాళ్లూ తమదైన శైలిలో వ్యాఖ్యలు జోడిస్తూ వాటిని పంచుకుంటున్నారు. నా మానసిక క్షోభకు, నిస్సహాయతకు ప్రతి ఒక్కరూ కారణమవుతున్నారు. మీటూలాంటి ఉద్యమంతో దేశం మేల్కొంటున్న ఈ దశలో ఇలా జరగడం బాధాకరం.’’

‘‘ఈ విషయమై ఇప్పటికే నేను ముంబయి పోలీసులను, సైబర్‌ క్రైమ్‌సెల్‌ను ఆశ్రయించాను. నా ఫొటోలను ఆన్‌లైన్‌లో లీక్‌ చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మీకు విన్నవించుకునేది ఒక్కటే. మనందరం హుందాగా జీవించాలి. దీనిని ఇంటర్నెట్‌లో ఇక్కడితో ఆపేస్తారని అనుకుంటున్నా’’అని పేర్కొన్నారు.

‘షమితాబ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన అక్షరహాసన్‌ ఆ తర్వాత అజిత్‌ ‘వివేగం’లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం తన తండ్రి కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘శభాష్‌ నాయుడు’ చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నారు.


తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు