close

తాజా వార్తలు

ఈటీవీ సత్యనారాయణకు ఏపీ ప్రభుత్వం సాయం‌

 

హైదరాబాద్‌: ఈటీవీలో పనిచేస్తున్న విలేకరి సత్యనారాయణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాయం అందించింది. కొన్ని నెలల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన సత్యనారాయణ ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ నుంచి పలువురు దాతలు ఆయన చికిత్స నిమిత్తం తమ చేయూత హస్తాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఆయనకు సాయం అందింది. ప్రముఖ నటుడు, ఎంపీ మురళీమోహన్‌ రూ.7లక్షల చెక్కును ఏపీ ప్రభుత్వం తరఫున అందజేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌ మాట్లాడుతూ..

‘ఆంధ్రా, తెలంగాణ అని కాదు.. సినీ పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యమే. ఆ రెండు రాష్ట్రాలూ సినీ పరిశ్రమకు రెండు కళ్లులాంటివి. తెదేపా అలనాటి నటుడు ఎన్టీఆర్‌ ప్రాణంగా పుట్టింది. ’ అని తెలిపారు. గతంలో ‘మా’ తరఫున సంస్థ అధ్యక్షుడు శివాజీరాజా సత్యనారాయణకు రూ.50వేలు ఇచ్చారు. ఇప్పుడు మరో రూ.50 వేల చెక్కును అందజేశారు.

 


తాజా వార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు