close
BETA SITE

తాజా వార్తలు

కేసీఆర్‌ నన్ను మోసం చేశారు

బాబూమోహన్‌

కేసీఆర్‌ నన్ను మోసం చేశారు

సంగారెడ్డి: సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తనను సంప్రదించకుండా మరో వ్యక్తికి టిక్కెట్‌ కేటాయించి కేసీఆర్‌ తనను మోసం చేశారని మెదక్ జిల్లా ఆంధోల్‌ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ అన్నారు. ఈరోజు సంగారెడ్డిలో భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది కేసీఆర్‌ వల్లేనని.. ఆయన ఎటు వెళ్తే అటువైపే ఉన్నానని తెలిపారు. 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తనను కాదని.. స్థానికుడి పేరుతో వేరొకరికి టిక్కెట్‌ కేటాయించడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తనకు కేసీఆర్‌ అంటే ఇష్టమని.. ఆయన్ని గాడ్‌ఫాదర్‌గా భావిస్తానన్నారు. అలాంటి వ్యక్తి తనను నడిరోడ్డుపై వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా జీవించానని.. టిక్కెట్‌ కోసం ఫాంహౌస్‌, ప్రగతిభవన్‌ చుట్టూ తిరగలేదన్నారు. తన సేవలను గుర్తించిన భాజపా పార్టీలోకి ఆహ్వానించిందని.. అందుకే ఆ పార్టీలో చేరానన్నారు. భాజపా నుంచి ఆంధోల్‌లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

 

రాజకీయం

 

జనరల్‌

 

సినిమా

 

క్రైమ్

 

స్పోర్ట్స్

 

బిజినెస్‌

 

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు