close
BETA SITE

తాజా వార్తలు

సమస్యల్లో ‘మహాభారతం’

సమస్యల్లో ‘మహాభారతం’

హైదరాబాద్‌: మలయాళీ సూపర్‌స్టార్‌ ప్రధాన పాత్రలో ‘మహాభారతం’ సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. భీముడిని ప్రధాన పాత్రగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. ప్రముఖ రచయిత ఎంటి వాసుదేవన్‌ నాయర్‌ రచించిన ‘రాందమూళం’ నవల ఆధారంగా సినిమాను శ్రీకుమార్‌ మేనన్‌ దర్శకత్వం వహించాలనుకున్నారు. ఈ సినిమాకు దుబాయ్‌కు చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త నిర్మాతగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు.

సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వాసుదేవన్‌ నుంచి చిత్రబృందం స్క్రిప్ట్‌ తీసుకుంది. అయితే స్క్రిప్ట్‌ తీసుకున్న సమయంలో మూడేళ్లలో సినిమాను తెరకెక్కించాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ నాలుగేళ్లు అవుతున్నప్పటికీ సినిమా పట్టాలపై ఎక్కకపోవడంతో వాసుదేవన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘దర్శకుడితో మూడేళ్లలో సినిమా పూర్తిచేయాలని ఒప్పందం కుదుర్చుకున్నా. ఇప్పుడు నాలుగేళ్లు అయిపోతోంది. అయినా సినిమా మొదలుపెట్టడంలేదు. అందుకే స్క్రిప్ట్‌ వెనక్కి ఇచ్చేయమని డిమాండ్‌ చేస్తున్నాను. అసలు సినిమా విషయంలో ఏం జరుగుతోందో పట్టించుకోకపోవడం నా తప్పే. త్వరలో ఆయన్ని కలిసి సినిమా పరిస్థితి ఏంటో తెలుసుకుంటాను.’ అని ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ భీముడి పాత్రలో నటించాల్సి ఉంది. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమా వాయిదా పడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.


Tags :

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

 

రాజకీయం

 

జనరల్‌

 

సినిమా

 

క్రైమ్

 

స్పోర్ట్స్

 

బిజినెస్‌

 

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు