close
BETA SITE

తాజావార్తలు

పౌరహక్కుల నేతల గృహనిర్బంధం పొడిగింపు

పౌరహక్కుల నేతల గృహనిర్బంధం పొడిగింపు

దిల్లీ: విప్లవ రచయితల సంఘం నేత వరవర రావు సహా ఐదుగురు ప్రముఖ పౌరహక్కుల నేతల గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. సెప్టెంబరు 17 వరకు వారిని గృహనిర్బంధంలోనే ఉంచాలని న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రముఖ చరిత్రకారురాలు రోమిలా థాపర్‌ పలువురు సామాజిక కార్యకర్తలు వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. అప్పటివరకు పౌరహక్కుల నేతలను గృహనిర్బంధంలోనే ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది.

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై.. ప్రముఖ విప్లవ రచయిత వరవరరావుతో పాటు పౌర హక్కుల కార్యకర్తలు గౌతమ్‌ నవ్‌లఖా, సుధా భరద్వాజ్‌, అరుణ్‌ ఫెరీరా, వెర్నన్‌ గొన్‌సాల్వేస్‌లను గత నెల 28న పుణె పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరి అరెస్టులపై రోమిలా థాపర్ సహా పలువురు కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత నెల 29న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పౌరహక్కుల నేతలకు తాత్కాలిక ఊరట కల్పించింది. వారిని అరెస్టు చేయకుండా గృహనిర్బంధంలో ఉంచాలని తెలిపింది.

తొలుత సెప్టెంబరు 6 వరకు గృహ నిర్బంధం విధించగా.. ఆ తర్వాత దాన్ని సెప్టెంబరు 12 వరకు పొడిగించింది. నేటితో ఆ గడువు ముగియడంతో గృహ నిర్బంధాన్ని మరోసారి పొడిగించింది.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.