close
BETA SITE

తాజావార్తలు

ధోనీ..భారత్‌ బంద్‌లో పాల్గొన్నాడా?

ధోనీ..భారత్‌ బంద్‌లో పాల్గొన్నాడా?

దిల్లీ: పెరుగుతున్న చమురు ధరలకు నిరసనగా సోమవారం (సెప్టెంబరు 10న) దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ బంద్‌లో భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహంద్ర సింగ్‌ ధోనీ కూడా పాల్గొన్నట్లు గత రెండు రోజులుగా ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో అభిమానులంతా ధోనీ భారత్‌ బంద్‌లో పాల్గొనడం నిజమేనా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ధోనీ..భారత్‌ బంద్‌లో పాల్గొన్నాడా?

ధోనీ తన భార్య సాక్షితో పాటు మరికొంద మందితో కలిసి ఓ పెట్రోల్‌ బంకులో కూర్చున్న ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే, తాజాగా దీనిపై ధోనీ సన్నిహితులు వివరణ ఇచ్చారు. ‘ధోనీ భారత్‌ బంద్‌లో పాల్గొనలేదు. గత నెలలో యాడ్ షూటింగ్‌ నిమిత్తం ధోనీ సిమ్లాలో పర్యటించాడు. ఈ సమయంలో తీసిన ఫొటో ఇది. అంతేకానీ, ధోనీ ఎలాంటి నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు’ అని వారు తెలిపారు.

ప్రస్తుతం ధోనీ క్రికెట్‌ నుంచి కాస్త విరామం దక్కడంతో తన సమయాన్ని కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నాడు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో ధోనీ ఆడనున్నాడు. ఇందుకోసం కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మరికొందరు ఆటగాళ్లతో కలిసి ధోనీ గురువారం దుబాయ్‌ బయలుదేరనున్నట్లు సమాచారం.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.