close
BETA SITE

తాజావార్తలు

భారీవర్షంతో అంత్యక్రియలకు అడ్డంకి

భారీవర్షంతో అంత్యక్రియలకు అడ్డంకి

జగిత్యాల గ్రామీణం: ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో నిన్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై 58 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతదేహాలకు జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ ఘటనలో రాంసాగర్‌, హిమ్మత్‌రావుపేట్‌, తిమ్మయ్యపల్లె, శనివారంపేట గ్రామాలకు చెందిన వారే దాదాపు 40 మంది మృతి చెందారు. వారి అంత్యక్రియలను బుధవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ గ్రామాల్లో భారీ వర్షం కురుస్తుండడంతో అంత్యక్రియలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో బంధువులు ఇబ్బంది పడుతున్నారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.