close
BETA SITE

తాజావార్తలు

పెళ్లి చేసుకుంటావా.. చంపేయాలా... 

వివాహితను బెదిరిస్తున్న ఉన్మాది అరెస్టు 

పెళ్లి చేసుకుంటావా.. చంపేయాలా... కేపీహెచ్‌బీకాలనీ: నన్ను పెళ్లిచేసుకో.. లేదంటే నీ భర్తను చంపేస్తా.. అంటూ ఓ వివాహితను వేధిస్తున్న ఉన్మాది చివరికి జైలు పాలయ్యాడు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు.. గాజుల రామారానికి చెందిన ఓ మహిళ అదే ప్రాంతంలో తన భర్తతో కలిసి నివసిస్తున్నారు. ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీకి చెందిన ఆట్ల సతీశ్‌(30)తో సదరు మహిళకు గతంలో పరిచయం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని సతీశ్‌ ఆ మెను పలు విధాలుగా వేధిస్తున్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానని బెదిరించసాగాడు. ఆమె భర్తను చంపి ఆమెను పెళ్లిచేసుకుంటానని వేధించసాగాడు. వీటిని తట్టుకోలేని మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు కేపీహెచ్‌బీ నాలుగోరోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. సతీశ్‌ కూడా ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న మహిళను అందరూ చూస్తుండగానే వేధించాడు. తనను పెళ్లిచేసుకోవాలని బెదిరిస్తూ ఆమె చేతిపై గాట్లు పెట్టాడు. దీంతో కుటుంబసభ్యులు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. వారు సతీశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఆమెను వేధించినందుకు నిందితుడిపె జీడిమెట్ల ఠాణాలో కేసు నమోదైందని సీఐ చెప్పారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.