close
BETA SITE

తాజావార్తలు

అప్పటి వరకు చిదంబరంను అరెస్టు చెయ్యొద్దు

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరానికి ఊరట లభించింది. ఆగస్టు 1 వరకు చిదంబరంను అరెస్టు చెయ్యొద్దని దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నేటితో ముగియనుండగా.. మరో నెల రోజుల పాటు గడువును పొడిగించాల్సిందిగా చిదంబరం కోర్టును కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన జస్టిస్‌ ఏకే.పథక్‌ అందుకు అంగీకరించారు. ఆగస్టు 1 వరకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఈ కేసుకు సంబంధించిన విచారణకు సీబీఐకి సహకరించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశంచింది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో దాదాపు కొన్ని కోట్ల మేర చిదంబరం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్‌కు భారీగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఇందులో ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి కూడా వాటా ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఫిబ్రవరి 28న కార్తీని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.