close
BETA SITE

తాజావార్తలు

మహేశ్‌, అల్లరి నరేశ్‌‌ పాత్రలివేనా?

మహేశ్‌, అల్లరి నరేశ్‌‌ పాత్రలివేనా?

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేశ్‌‌ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. ఇటీవల డెహ్రాడూన్‌లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రైతు ఆత్మహత్యల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి.

కాగా ఈ సినిమాలో మహేశ్‌ సంపన్నుడి పాత్రలో, నరేశ్‌‌ పేద యువకుడి పాత్రలో కనిపించనున్నారని తాజాగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి స్నేహం నేపథ్యంలో సినిమా ఉంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం కళాశాల ఎపిసోడ్‌ను డెహ్రాడూన్‌లో షూట్‌ చూస్తున్నారట. ఈ చిత్రీకరణలో మహేశ్‌తోపాటు నరేశ్‌‌, పూజా కూడా పాల్గొన్నారు. దాదాపు నెలపాటు అక్కడే చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘భరత్‌ అనే నేను’ హిట్‌ తర్వాత మహేశ్‌ నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.