close
BETA SITE

తాజావార్తలు

బీదర్‌లో అపరిచిత మహిళ కోసం గాలింపు

బీదర్‌లో అపరిచిత మహిళ కోసం గాలింపు

హైదరాబాద్‌ : సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల నుంచి పాపను ఎత్తుకెళ్లిన కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. నిందితురాలు పసికందును బీదర్ తీసుకెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 8 బృందాలు బీదర్‌తో పాటు పరిసర గ్రామాల్లో గాలింపు చేపట్టాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాపను ఎత్తుకెళ్లిన మహిళ సాయంత్రం 5 గంటలకు బీదర్ చేరినట్లు పోలీసులు గుర్తించారు. బీదర్ శివారు ప్రాంతాల్లో మహిళ పాపతో బస్సు దిగినట్లు బస్సు డ్రైవర్, కండెక్టర్ ద్వారా తెలుసుకున్నారు. పాప తల్లి విజయ మాత్రం కన్నీరుమున్నీరవుతోంది. పాపను తన ఒడిలోకి చేర్చేవరకూ ఆస్పత్రి నుంచి నుంచి కదలనని తేల్చిచెప్పింది.

ఆరు రోజుల వయస్సున్న పసికందుకు టీకా వేయించుకొస్తానంటూ నమ్మబలికిన ఓ అపరిచిత మహిళ ఈ వంచనకు పాల్పడింది. సోమవారం సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. సీసీ కెమేరాల ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని పోలీసులు గుర్తించారు. నిందితురాలు మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ (ఎంజీబీఎస్‌)లో బీదర్‌ బస్‌ ఎక్కినట్లు అక్కడి సీసీ కెమేరాల్లో నమోదైంది. దీంతో పోలీసు బృందాలు బీదర్‌ వైపు వెళ్లాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్లమ్మతండాకు చెందిన ఎస్‌.నరీ డీసీఎం డ్రైవర్‌. ఆయన భార్య విజయ రెండో కాన్పు కోసం గత నెల 21న ఆస్పత్రిలో చేరింది. రక్తహీనత ఉండటంతో వైద్యులు 27న సిజేరియన్‌ శస్త్రచికిత్స నిర్వహించగా ఆడ శిశువు జన్మించింది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో విజయ భర్త నరీ, ఆమె తల్లి చాందీ వార్డు నుంచి బయటకు వెళ్లగా..బిడ్డతో బాలింత ఒంటరిగా ఉండటాన్ని గమనించిన గుర్తు తెలియని మహిళ అక్కడకు వెళ్లింది. టీకా వేసేందుకు డాక్టర్‌ తీసుకురమ్మన్నారంటూ పసికందును చేతుల్లోకి తీసుకుంది. ఆ మాటలు నమ్మిన విజయ...బిడ్డతో పాటు కేసుషీటును ఆ మహిళ చేతిలో పెట్టింది. ఆ తర్వాత కొంతసేపటికి వార్డులోకి వచ్చిన చాందీ..పాప ఏదంటూ ప్రశ్నించగా..టీకా కోసం తీసుకెళ్లారని విజయ చెప్పింది. బిడ్డను తీసుకువెళ్లిన మహిళ ఎంతకీ తిరిగి రాకపోవడంతో నరీ, చాందీ ఆసుపత్రి అంతా వెతికారు. కనిపించక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.