close
BETA SITE

తాజావార్తలు

తాత్కాలిక డీజీపీల నియామకాలు చేపట్టొద్దు

రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

దిల్లీ: పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏ పోలీస్‌ అధికారిని యాక్టింగ్‌(తాత్కాలిక) డీజీపీగా నియమించుకోరాదని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిక ప్రాంతాలను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని డీజీపీగా నియమించుకోరాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. డీజీపీ పదవికాలం పూర్తవడానికి మూడు నెలలు ముందుగా.. తదుపరి డీజీపీ కోసం అర్హులైన సీనియర్‌ పోలీసు అధికారుల జాబితాను రాష్ట్రాలు యూపీఎస్సీకి పంపించాలని కోర్టు ఆదేశించింది. ఈ జాబితాను పరిశీలించిన అనంరతం యూపీఎస్సీ వారిలో నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తుందని తెలిపింది. ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్రాలు డీజీపీగా నియమించుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అంతేగాక.. ఒకసారి డీజీపీని నియమిస్తే ఆ వ్యక్తి తన పదవీకాలం పూర్తయ్యేంత వరకు డీజీపీగా కొనసాగాలని కోర్టు ఆదేశించింది. అంతేగానీ తాత్కాలిక డీజీపీలుగా ఎవరినీ నియమించుకోరాదని వెల్లడించింది.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.