close
BETA SITE

తాజావార్తలు

రషీద్‌.. నీవయస్సెంతో తెలిసిపోయింది!

సామాజిక మాధ్యమాల్లో రషీద్‌కు భారత అభిమానుల చురకలు

రషీద్‌.. నీవయస్సెంతో తెలిసిపోయింది!

దిల్లీ: అఫ్గాన్‌ స్పిన్‌ మాంత్రికుడు రషీద్‌ఖాన్‌పై భారత క్రికెట్‌ అభిమానులు చురకలు అంటించారు. నీ వయసెంతో తెలిసిపోయిందంటూ కామెంట్లు పెట్టారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. అఫ్గాన్‌-బంగ్లాదేశ్‌ మధ్య గురువారం మూడో టీ20 జరిగింది! ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో 9 పరుగులు చేస్తే బంగ్లాదేశ్‌ విజయం సాధించేది.

ఐతే, రషీద్‌ ఖాన్‌ వేసిన చివరి ఓవర్లో బంగ్లాదేశ్‌ 5 పరుగులు మాత్రమే సాధించి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌ చేజారింది. చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ వేసిన రషీద్‌ను మెచ్చుకుంటూ భారత కామెంటేటర్‌ హర్షా భోగ్లే ఓ ట్వీట్‌ చేశాడు. ‘చివరి ఓవర్లో బంగ్లా 9 పరుగులు సాధించాలి. ఆ సమయంలో బంతిని అందుకన్న రషీద్‌ ఖాన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అఫ్గాన్‌ 3-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకునేలా చేశాడు. స్పిన్‌ మాంత్రికుడు మరోసారి తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు’ అని పేర్కొన్నాడు. దీనికి రషీద్‌ స్పందించాడు. ‘ధన్యవాదాలు సోదరా’ అని బదులిచ్చాడు.

హర్షా భోగ్లే వయస్సు 56 సంవత్సరాలు. రషీద్‌ ఖాన్‌కు 19 ఏళ్లు. తనకంటే వయస్సులో ఎంతో పెద్దవాడైన భోగ్లేకి రషీద్‌ ఇచ్చిన సమాధానం భారత అభిమానులకు కోపం తెప్పించింది. దీంతో ‘సోదరా ఏంటి? భోగ్లే 50 ప్లస్‌.. నువ్వేమో అండర్‌-20. ఇంతకంటే ముఖ్యమైన విషయం అతడో లెజెండరీ కామెంటేటర్‌. మరోసారి జాగ్రత్తగా బదులివ్వు; నీ వయస్సు 19 కాదనడానికి ఇదే ఆధారం; భోగ్లేకి నీ తండ్రి వయస్సు ఉంది.. దయచేసి గౌరవం ఇవ్వు’ అంటూ చురకలు అంటించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రషీద్‌ ఖాన్‌ 8 వికెట్లు దక్కించుకున్నాడు. రెండు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.