close
BETA SITE

తాజావార్తలు

రైతుల కోసం మరెంతో చేయాలనే తపన పెరిగింది

రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలనేదే నా లక్ష్యం.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనదాయిని
రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్‌

రైతుల కోసం మరెంతో చేయాలనే తపన పెరిగింది

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై.. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు చెబుతూ కేసీఆర్‌ ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘తెలంగాణ ఏర్పడితేనే మన రాత మారుతుందని పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళి అర్పిస్తున్నా. ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని పెంచుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద పేద ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం చేస్తున్నాం. వసతి గృహ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం. రైతులకు రుణమాఫీ చేశాం, వ్యవసాయ పరికరాలకు రాయితీ ఇచ్చాం. నీటి తీరువా, ట్రాక్టర్లపై వాహన పన్ను రద్దు చేశాం. గోదావరి, కృష్ణా జలాలు పొలాల్లో పారేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనదాయిని కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వేగంగా, ఆధునిక పరిజ్ఞానంతో కాళేశ్వరం నిర్మిస్తున్నాం. కేంద్ర జలసంఘం సభ్యులు కూడా కాళేశ్వరం నిర్మాణాన్ని మెచ్చుకున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.’

రూపాయి తీసుకోకుండా రూ.5 లక్షల బీమా..
‘రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా అమలు చేస్తున్నాం. రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతోంది.. ఈ పరిస్థితి రాకూడదనే.. రైతు బీమా పథకాన్ని తీసుకువచ్చాం. రైతుల నుంచి రూపాయి తీసుకోకుండా రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నాం. భూముల వివరాలు పారదర్శకంగా ఉండే ధరణి వెబ్‌సైట్‌ రూపొందించాం.’

రైతుల కోసం మరెంతో చేయాలనే తపన పెరిగింది

రైతుల ముఖాల్లో ఆనందం..
‘రైతు బంధు పథకంతో రైతుల ముఖాల్లో ఆనందం చూస్తున్నాం. సాగుపెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయాల్సిన అవసరం తప్పింది. రైతుల కోసం మరెంతో చేయాలనే తపన నాలో పెరిగింది. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయాలనేదే నా లక్ష్యం. ఎకరాకు రూ.8 వేల పెట్టుబడిసాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కొందరు ధనిక రైతులు రైతుబంధు చెక్కులు వదులుకొని స్ఫూర్తిగా నిలిచారు. మరికొందరు రైతులు రైతుబంధుకు విరాళాలు ఇచ్చి తమ మంచి మనసు చాటుకున్నారు.’

ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల అపోహలు పోయాయి..
ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో అపోహలు తొలగి విశ్వాసం పెరగింది. స్వయంగా గవర్నర్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడమే ఇందుకు నిదర్శనం. అక్కడి సదుపాయాలు చూసి గవర్నర్‌ప్రశంసించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ, డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో అనేకమంది కంటి సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కంటి వైద్య పరీక్షలు, శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహిస్తాం’ అని కేసీఆర్‌ అన్నారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.