close
BETA SITE

తాజావార్తలు

సెహ్వాగ్‌ రికార్డును సమం చేసిన బట్లర్‌

సెహ్వాగ్‌ రికార్డును సమం చేసిన బట్లర్‌

ముంబయి‌: రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న బట్లర్‌ ఐపీఎల్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. ఆ రికార్డు ఏమిటంటే. ఐపీఎల్‌ చరిత్రలో ఒకే సీజన్‌లో వరుసగా 5 అర్ధశతకాలు సాధించడం. ఔను. 2012లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడిన సెహ్వాగ్‌ ఆ సీజన్‌లో వరుసగా ఐదు అర్ధశతకాలు నమోదు చేశాడు.

మళ్లీ ఇన్నాళ్లకు బట్లర్‌ ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో వరుసగా 5 అర్ధశతకాలు నమోదు చేసి సెహ్వాగ్‌ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. టోర్నీలో భాగంగా ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు దిల్లీ డేర్‌డెవిల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఒకసారి, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాజ్‌పై రెండుసార్లు అర్ధశతకాలు సాధించాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్‌లో కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఇలా వరుసగా ఐదు అర్ధశతకాలు నమోదు చేశారు. వీరేంద్ర సెహ్వాగ్‌, బట్లర్‌, హామిల్టన్‌ మసకడ్జా, కమ్రాన్‌ అక్మల్‌ ఈ జాబితాలో ఉన్నారు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన బట్లర్‌ 509 పరుగులు సాధించాడు. జనవరిలో నిర్వహించిన వేలంలో రూ.4.4కోట్లకు బట్లర్‌ను రాజస్థాన్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆరు మ్యాచ్‌ల్లో విజయాలతో రాజస్థాన్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. వారం కిందటి వరకు పట్టికలో అట్టడుగున నిలిచిన రాజస్థాన్‌ ఇప్పుడు ప్లేఆఫ్‌కు గట్టి పోటీదారుగా నిలిచింది.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.