close
BETA SITE

తాజావార్తలు

పిడుగుపాటుపై అప్రమత్తంగా ఉండాలి

పేదరికం విషయంలో గుజరాత్‌ కంటే మెరుగ్గా ఉన్నాం
టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

పిడుగుపాటుపై అప్రమత్తంగా ఉండాలి

అమరావతి: పిడుగులతో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు జారీ చేశారు. పిడుగుల సమాచారం గ్రామాలకు, ప్రజలకు ముందే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పిడుగుల సమాచారం ముందే ఇస్తున్నా ఇంకా మరణాలు సంభవిస్తుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిడుగుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతి చెందిన ఘటనలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. అటు నీరు ప్రగతి, వ్యవసాయంపైనా సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయ పనులు లేవు కాబట్టి ఉపాధి పనులు ముమ్మరం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యేలోపు నరేగా పనులు గరిష్టంగా చేపట్టాలన్నారు. ఈ నెలలోనే రూ.1,000కోట్లు విలువైన నరేగా పనులు చేయాలని సూచించారు. రోజువారీ కూలీల హాజరు 23లక్షలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. 525గ్రామాల్లో తాగునీటి రవాణా జరుగుతోందని.. ఈ గ్రామాల్లో తాగునీటి పథకాల పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. గిరిజన తండాల్లో రూ.105కోట్లతో 1,017పనులు వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 531 పనులు త్వరితగతిన చేపట్టాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాలలో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. మరో 8వేల మరుగుదొడ్లు నిర్మిస్తే రాష్ట్రంలో 100% ఓడిఎఫ్ పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖలోనూ మరుగుదొడ్ల నిర్మాణం వేగం పుంజుకోవాలని.. ఓడీఎఫ్ ప్లస్ పనులకు అన్నిజిల్లాలు సంసిద్ధం కావాలన్నారు. రూ.900కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
కేంద్రంతో విభేదించినా తమిళనాడు, కేరళ అభివృద్ధిలో ఉన్నాయని.. వాటి బాటలోనే మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండాలని చంద్రబాబు అధికారులతో అన్నారు. ప్రాథమిక విద్యలో మూడో స్థానంలో ఉన్నామని, ఐఐటీలో 12% ఫలితాలు ఏపివేనని గుర్తుచేశారు. దేశంలోనే విద్యారంగంలో ఆంద్రప్రదేశ్‌ నంబర్‌వన్ కావాలన్నారు. పదేళ్ళలో దేశంలో పేదరికం 51%నుంచి 21%కు చేరిందన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలలో పేదరికం స్థాయి 9% వచ్చిందని.. కేరళలో పేదరికం 1%, తమిళనాడులో 6%, కర్ణాటకలో 11%, తెలంగాణలో 12%, ఆంధ్రప్రదేశ్‌లో 13% ఉందని తెలిపారు. ఈ విషయంలో గుజరాత్ 16%, పశ్చిమ బెంగాల్ 17% కంటే ఏపీ మెరుగ్గా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.


Tags :

సంబంధిత వార్తలు

తాజావార్తలు

రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

© 1999- 2017 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.