close
BETA SITE

కర్ణాటకలో పెరిగిన పోలింగ్‌ 

72.13 శాతం నమోదు 
1952 తర్వాత ఇదే అత్యధికం! 
ఈనాడు డిజిటల్‌-బెంగళూరు 

కర్ణాటక విధానసభకు శనివారం నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 72.13 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికలతో (2013) పోలిస్తే ప్రస్తుతం 0.68 శాతం పెరిగింది. 1952 తర్వాత ఇదే అత్యధిక పోలింగ్‌ కావడం గమనార్హం. మహిళలు, యువత ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 222 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో చిట్టచివరన, అటవీ ప్రాంతాలతో కూడిన చామరాజనగర జిల్లాలో అత్యధికంగా 87.50 శాతం పోలింగ్‌ నమోదు కాగా, కాంక్రీటు కీకారణ్యం,  మేధావుల నిలయం బెంగళూరులో అతి తక్కువగా 48.03 శాతం మందే ఓటు వేశారు. ఉత్తర కన్నడ జిల్లాలో వర్షాల కారణంగా పోలింగ్‌ శాతం తక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. నగర ప్రాంతాల్లో ఈ సారి 74.2 శాతం పోలింగ్‌ జరగ్గా గ్రామీణ ప్రాంతాల్లో 85.01 శాతం నమోదైంది. మౌలిక సదుపాయాలు అధికంగా ఉన్నా నగర వాసులు అందులోనూ బెంగళూరు ప్రజలు 50 శాతం కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. నగర వాసులను దృష్టిలో ఉంచుకునే ఈ సారి ఎన్నికల సంఘం ‘చునావణ’ అనే మొబైల్‌ యాప్‌, ప్రత్యేక డ్యాష్‌బోర్డులు, జీఐఎస్‌ విధానంతో పోలింగ్‌ కేంద్రాల మార్గసూచీలను ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. ఈ ఎన్నికల్లో పురుషులు 75.25 శాతం, మహిళలు 71.45 శాతం ఓటు వేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటెలో    అత్యధికంగా 89.97 శాతం, బెంగళూరు నగర జిల్లా శివాజీనగరలో అతి తక్కువగా 45.10 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈవీఎంలో సాంకేతిక లోపాల కారణంగా హెబ్బాళలోని లొట్టగొల్లహళ్లి, కొప్పళ్లలోని కుష్టగి కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్‌ నిర్వహిస్తారు. ఓటరు గుర్తింపు కార్డుల అక్రమాలు వెలుగు చూసిన కారణంగా రాజరాజేశ్వరి నగరలో పోలింగ్‌ను వాయిదా వేశారు. అక్కడ ఈ నెల 28న ఎన్నికలు జరుగుతాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

    ఎక్కువ మంది చదివినవి (Most Read)
రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.