close

బుధవారం, అక్టోబర్ 17, 2018

తాజా వార్తలు

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో 

అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో 

పోలవరం: గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా పోలవరం నియోజకవర్గ ప్రత్యేకాధికారి కె. మోహన్‌ కుమార్‌ గురువారం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలవరంలోని ఎడ్లగూడెం అంగన్వాడీ కేంద్రంలో 15 మంది పిల్లలకు గానూ ఐదుగురు మాత్రమే ఉండటంతో పాటు కార్యకర్త లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సక్రమంగా విధులకు హాజరుకావాలని, రికార్డులో ఉన్న విధంగా పిల్లలందరూ కేంద్రాల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అనంతరం ఆయన పోలవరంలోని చౌక డిపోలను సందర్శించి నిత్యావసర సరుకుల పంపిణీ గురించి డీలర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీడీవో నిర్మల జ్యోతి తదితరులు ఉన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు