close

బుధవారం, అక్టోబర్ 17, 2018

తాజా వార్తలు

విజయవాడలో ఫ్లెక్సీల కలకలం 

జనసేనపై కాట్రగడ్డ ప్రశ్నల వర్షం 

విజయవాడలో ఫ్లెక్సీల కలకలం 

విజయవాడ: నగరంలో రాజకీయ ఫ్లెక్సీలపై మరోసారి దుమారం రేగింది. తెదేపా నేత కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీల ద్వారా జనసేనపై ప్రశ్నలు ఎక్కుపెట్టారు. ప్రశ్నించడానికే జనసేన అని చెబుతున్న పవన్‌గారూ.. వెనుకబడిన జిల్లాల నిధులతో సహా రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని మీరెప్పుడో గాలికి వదిలేశారు అంటూ ఫ్లెక్సీ ద్వారా విమర్శల వర్షం కురిపించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.100కి చేరువవుతున్నా, పట్టించుకోని స్థితిలో ఉన్నారంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీకి దత్తపుత్రుడిగా మారటం వల్లే ఏపీ సమస్యలపై నోరు మెదపలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రజలంతా పవన్‌ కదలికలను నిశితంగా గమనిస్తున్నారని, ఫ్లెక్సీలో పొందుపరిచారు. నగరంలోని బెంజ్‌ సర్కిల్‌, స్టేడియం వద్ద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు