close

శనివారం, జూలై 21, 2018

తాజా వార్తలు

ఆందోళన.. ఉత్కంఠ 

సమన్వయంతో పనిచేసిన అధికారులు 
ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది విశేష కృషి 
ఆమ్ల ట్యాంకర్‌కు తప్పిన ప్రమాదం 
ఆందోళన.. ఉత్కంఠ 

కాజ (గ్రామీణమంగళగిరి), న్యూస్‌టుడే: సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ట్యాంకరు పడిపోవటంతో ప్రమాదం.. బయటకు వస్తున్న ఆమ్లంతో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికుల భయాందోళన.. ఏమి జరుగుతుందోనని ఉత్కంఠ.. సురక్షితంగా ట్యాంకరును బయటకు తీయటంతో అధికారుల్లో సంతోషం... గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా వద్ద ఆదివారం కనిపించిన  దృశ్యాలివీ..  అదుపుతప్పి పడిపోయిన సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ట్యాంకర్‌ను అధికారులు ఏడు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్‌ అధికారులు, టోల్‌ప్లాజా సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. కాకినాడ నుంచి చెన్నై వెళుతుండగా కాజ టోల్‌ప్లాజా వద్దకు వచ్చేసరికి బ్రేకులు పడలేదు. డ్రైవరు బండారు సమయస్ఫూర్తిగా వ్యవహరించి లారీని రహదారి పక్కకు మళ్లించాడు. రహదారి అంచున ఉన్న కాలువను, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి  పక్కకు పడిపోయింది.  ఆ సమయంలో అటుగా వాహనాలేవీ రాకపోవటంతో ఎటువంటి ప్రమాదం జరుగలేదు. ఈ ప్రమాదంలో డ్రైౖవరు సురక్షితంగా బయటపడ్డాడు.

ఆందోళన.. ఉత్కంఠ 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు