close

బుధవారం, సెప్టెంబర్ 26, 2018

తాజా వార్తలు

మహిళా సంఘాలకు శిక్షణ..

 

అర్బన్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జాతీయ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసే రేషన్‌ డీలర్లు సమ్మె సందర్భంగా జిల్లాలో ప్రజా పంపిణీ సజావుగా సాగేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. శనివారం హన్మకొండ ములుగురోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్‌లో జిల్లాలోని స్వయం సహయాక సంఘాల మహిళలకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ-పాస్‌ యంత్రాలు లేక పోవడంతో సరకులను ఎలా పంపిణీ చేయాలి? రికార్డులను ఎలా నమోదు చేయాలనే అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు. ఈనెల 5 నుంచి 10 వరకు వీరితో రేషన్‌ సరకులు పంపిణీ చేయించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారిని విజయలక్ష్మి, ఆర్‌డీవో వెంకారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు