close

బుధవారం, సెప్టెంబర్ 26, 2018

తాజా వార్తలు

రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి 

కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి 

రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి 

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: జనగామలో ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కేంద్రం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. కానిస్టేబుల్‌, వీఆర్‌వో పరీక్షలు రాయబోయే (ఔత్సాహికులకు) అభ్యర్థులకు గ్రామీణాభివృద్ధి సంస్థ, వారధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువతీయువకులు జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదల, కృషి, అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. కేంద్రంలో సౌకర్యాల కల్పన కోసం తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి శిక్షణా తరగతులు నిరుద్యోగ యువతకు ఎంతగానో తోడ్పాటునందిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఆర్డీవో మేకల జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ కమిషన్‌ నిర్వహించనున్న గ్రూప్‌-4, వీఆర్‌ఓ, జూనియర్‌ అసిస్టెంటు, కానిస్టేబుల్‌ పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డీసీపీ మల్లారెడ్డి మాట్లాడుతూ పోలీసు రంగంపై ఆసక్తి గల వారు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత దేహడారుఢ్యశిక్షన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 60 రోజులు సాగే ఈ శిక్షణలో 400 మంది అభ్యర్థులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ట్రైనర్‌గా సురేశ్‌ వ్యవహరిస్తున్నారు. వారధి సొసైటీ సీఈవో ఆంజనేయులు, ఉపాధి, సెర్ప్‌ ఏపీడీలు సంపత్‌రావు, నూరోద్దీన్‌, డీపీఎం రాజేంద్రప్రసాద్‌, శిక్షణ కోఆర్డినేటర్‌ ఎండీ ఖాజా పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు