close

బుధవారం, సెప్టెంబర్ 26, 2018

తాజా వార్తలు

బల్దియాలో ఎలక్ట్రిక్‌ స్వచ్ఛ ఆటోలు 

బల్దియాలో ఎలక్ట్రిక్‌ స్వచ్ఛ ఆటోలు 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెత్త సేకరణకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్వచ్ఛ ఆటోల సానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ కార్లను ప్రవేశపెట్టిన జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రిక్‌ ట్రాలీ ఆటోలను ప్రయోగాత్మకంగా చార్మినార్‌లో ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.బి.జనార్దన్‌రెడ్డిసోమవారం వాహనాల పనితీరును పరిశీలించారు. స్థానిక జీ.ఎం.డబ్ల్యూ సంస్థ రూపొందించిన ఈ ఎలక్ట్రిక్‌ వాహనం కిలోమీటరు తిరిగేందుకు అయ్యే వ్యయం 50 పైసలు మాత్రమే. ఒకసారి పూర్తి ఛార్జింగ్‌ చేస్తే 800 కిలోల బరువుతో 110 కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణిస్తుందని జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు