close

మంగళవారం, ఆగస్టు 14, 2018

తాజా వార్తలు

ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే : జిల్లాలోని పాఠశాలల్లో కనీస సామర్థ్యాల పెంపు కోసం నిర్వహిస్తున్న అభ్యసనాభివృద్ధి కార్యక్రమంలో వెనుకంజలో నిల్చిన ప్రభుత్వ పాఠశాలలలోని పాఠ్యాంశాల ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు సోమవారం కరీంనగర్‌లో ప్రారంభమయ్యాయి. డ్వామా సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు గణితం, తెలుగు, ఆంగ్లం పాఠ్యాంశాలపై ఈ శిక్షణను అందిస్తున్నారు. 3ఆర్‌ కార్యక్రమం అమలు, అనంతరం థర్డ్‌పార్టీతో జిల్లాలోని నిర్వహించిన పరీక్షలో మూడు పాఠ్యాంశాల్లో అర్హత సాధించని పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఈ శిక్షణను అందిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం గణితంను బోధించే 50 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఈ శిక్షణను నిర్వహించారు. ఇప్పటివరకు 3ఆర్‌ కార్యక్రమాల అమలు, లోపాలు, ప్రగతి కోసం ప్రస్తుతం చేపట్టాల్సిన అంశాలు, బోధనలో నైపుణ్యాలు వంటి అంశాలపై గణితం రాష్ట్ర రిసోర్స్‌ పర్సన్‌ కె.అశోక్‌రెడ్డి ఉపాధ్యాయులకు వివరించారు. కార్యక్రమంలో సెక్టోరల్‌ అధికారి డి.శ్రీనివాస్‌, నోడల్‌ అధికారి కోట లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు