close

బుధవారం, మే 23, 2018

తాజా వార్తలు

‘ప్రతిపక్ష నాయకులు సహకరించాలి’

నర్సాపూర్‌: తెరాస ప్రభుత్వ హయాంలో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని జడ్పీ అధ్యక్షురాలు రాజమణి అన్నారు. సోమవారం నర్సాపూర్‌లో తెరాస ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు వారి తీరును మార్చుకొని సహకరించాలని హితవుపలికారు. రైతుల ప్రయోజనాల కోసమే రైతు సమన్వయ సమితులను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని, కార్పొరేషన్‌ ఏర్పాటు వల్ల మేలు జరుగుతుందని తెలిపారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న వారికి వీలైనంత త్వరలో పరిహారం అందుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు