close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

‘అథర్వ’ 2కె18... అదుర్స్‌ 

ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు 
సంప్రదాయ దుస్తుల్లో తళుక్కు..

సిద్దిపేట, న్యూస్‌టుడే: విద్యార్థుల సరదా ఆటలు... గోకార్ట్‌ రేసింగ్‌తో సిద్దిపేట శివారులోని పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాల సందడిగా మారింది. ‘అథర్వ 2కె18’ పేరిట రెండు రోజుల పాటు జరిగే వేడుకకు సోమవారం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా సందడి చేశారు. క్రికెట్‌, కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్‌ వంటి పోటీల్లో పోటాపోటిగా పాల్గొన్నారు. గోకార్ట్‌ రేసింగ్‌లో ప్రిన్సిపల్‌ ప్రభుజి బెన్‌కాక్‌ సహా విద్యార్థులు పాల్గొన్నారు. ఆహార పదార్థాలు, క్రీడలు, విజ్ఞానానికి సంబంధించిన 30 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇష్టమైన ఆహారాన్ని విద్యార్థులు తీసుకున్నారు. మెదడుకు పదునుపెట్టే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్సవంలో ప్రదర్శించిన గోకార్టు రేసింగ్‌ వాహనం ఆకట్టుకుంది. ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన మెకానికల్‌ చివరి సంవత్సర విద్యార్థులు ఎంఎస్‌.సుజిత్‌, ఎండి.యాకుబ్‌ నేతృత్వంలో రూపొందించారు. దీనికి రూ.1.80 లక్షల వ్యయం అయింది. పలువురు వాహనంలో సరదాగా కూర్చొని నడిపేందుకు యత్నించారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు