close

గురువారం, ఆగస్టు 16, 2018

తాజా వార్తలు

ఇందిరా ప్రియదర్శిని కళాశాలకు ద్వితీయ బహుమతి

మెదక్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిజ్ఞాస విభాగంలో రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో మెదక్‌ ప్రభుత్వ ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు కామర్స్‌లో ద్వితీయ బహుమతి సాధించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన జిజ్ఞాస కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ నరసింహం, అధ్యాపకురాలు అమరావతి, బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థినులు లావణ్య, సుమలత, పవిత్ర, చిత్ర, దీపికలకు ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతిని అందజేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు