close

సోమవారం, అక్టోబర్ 15, 2018

తాజా వార్తలు

నాలుగు వరుసల రహదారికి సర్వే 

నాలుగు వరుసల రహదారికి సర్వే 

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: మెదక్‌-నర్సాపూర్‌-హైదరాబాద్‌ రోడ్డును 765డి జాతీయ రహదారిగా నాలుగు వరుసలుగా విస్తరణ పనులు చేపట్టడానికి సర్వే చేపట్టినట్లు జాతీయ రహదారుల డీఈ చంద్రశేఖర్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన పనులను గుత్తేదారుకు అప్పగించేందుకు టెండరు ప్రక్రియ దిల్లీలో ప్రారంభమైందని వివరించారు. వారం రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. మేడ్చల్‌ జిల్లా గండిమైసమ్మ బాహ్యవలయ రహదారి నుంచి మెదక్‌ సమీపంలోని రాంపూర్‌ వరకు 62 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం సాగుతుందన్నారు. మేడ్చల్‌, సంగారెడ్డి, మెదక్‌ మూడు జిల్లాల మీదుగా ఉన్న ఈ మార్గాన్ని నాలుగు వరుసలతో మురుగు కాలువ, ఫుట్‌పాత్‌, డివైడర్లు కలుపుకొని ఇరువైపులా 50 అడుగులతో విస్తరిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు, విద్యుత్తు తీగలు, స్తంభాలు, నీటిపథకం పైప్‌లైన్లకు ఎంతమేర నష్టం జరుగుతుందనేది సర్వే చేస్తున్నామన్నారు. ప్రక్రియ ముగిశాక తెలుస్తుందన్నారు. రక్షిత అటవీ ప్రాంతంలో మలుపులను సరిచేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు