close

సోమవారం, అక్టోబర్ 22, 2018

తాజా వార్తలు

రైతు ఆత్మహత్య కుటుంబాలకు ఆర్థికసాయం

ఇచ్చోడ, న్యూస్‌టుడే: ఆత్మహత్యలకు పాల్పడి మృతి చెందిన రైతు కుటుంబాలకు తమ వంతుగా ఆర్థిక సహాయం చేయాలని రైతు స్వరాజ్యవేదిక రాష్ట్ర సంఘం సౌజన్యంతో సిటి కేరింగ్‌ సిటిజన్స్‌ కలెక్టివ్‌ అనే సంస్థ ముందుకొచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 130 మంది రైతు ఆత్మలు చేసుకున్న కుటుంబాలకు సంస్థ తరపున ఆర్థిక సహాయం చేశారు. అందులో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఆత్మహత్యలు చేసుకున్న 10 మంది రైతు కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారని రైతు స్వరాజ్యవేదిక జిల్లా కన్వీనర్‌ సంగెపు బొర్రన్న పేర్కొన్నారు. జిల్లా నుంచి ఆర్థిక సహాయం పొందిన వారిలో కంది రేఖ, ఎం.రజిత, ఆర్‌.కవిత, కె.కల్పన, ఎం.జంగుబాయి, ఇ.గంగామణి, బి.భూమారెడ్డి, ఎస్‌.లక్ష్మీ, ఎస్‌.రాధ, ఎ.లక్ష్మీబాయి ఉన్నారు.

జిల్లా వార్తలు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు